పల్లవి : కాలం కదిలే చోటు ..ప్రాణం తనకై వేస్తూ
పరుగెడుతూ ...నిలబడుతూ తనకై నే ఉన్నానే
కనబడుతూ.. వినబడుతూ... కలలోనే ఉన్నానే
ప్రాణం వీడని ప్రాయం... దోషం తెలియని స్నేహం
మనదేలే మర్మం తెలియని ప్రేమ...............
చరణం: అటుపక్కన అందాలున్న ... ఇటుపక్కన వయ్యారాలు
కడతేరక ప్రేమలో నే ఉన్నా నీకోసం పడిచస్తున్నా
స్వర్గానికి నిచ్చెన వేసి ఆతార జువ్వలు కోసి
నీ గుడిలో దీపం పంచాలి ఓ దేవత కరుణను పొందాలి
చరణం : ఆనంద స్వర్గాలెన్నో ఓ మగువ గుండెకు లోతు
తెరతీయక మౌనంగాఉన్నా ..నీవేశం నే వేస్తున్నా
కదిలోచ్చె కన్నెను చూసి ,ఆ కన్నె వలపులు కాచి
నీ వడిలో ప్రాణం ఉంచాలి నా దేవత ప్రేమను పొందాలి
No comments:
Post a Comment