Showing posts with label ప్రేమ కోరిక ...ప్రేమికుల రోజు స్పెషల్. Show all posts
Showing posts with label ప్రేమ కోరిక ...ప్రేమికుల రోజు స్పెషల్. Show all posts

ప్రేమ కోరిక ...ప్రేమికుల రోజు స్పెషల్

 ప్రేమ కోరిక ...ప్రేమికుల రోజు స్పెషల్

 

ఆకాశపు  అంచులలో  మెరుపుల  వడిలో  నేను  (ప్రేమ )
తలుపుల  తాకిడితో  తనివితీరా  ప్రేమను  పంచె  ప్రియురాలు  (త్యాగం )
...
మెలుకువ  రాణి  మనసు  కదిపినా  కరిగిపోని  కళలు
ఒక్క  క్షణం  వీడినా  మనసార  బాధపడే  ఓ  మంచి  మనసు
ఇన్ని  ఉన్న  ఎక్కడో  ఒక  లోపం ..ఏమిటో  తెలుసా ..
.....
నాకు  ఎరుపు  వర్ణము  తోడుగుతూ 
నరకపు  అంచుల్లోకి  నేట్టుతూ  సంతోషాన్ని  అనుభవిస్తున్నారు
నేను  చేసిన  తప్పు  ఏమిటి ...




నా  వర్ణము  తెలుపు ...నేను  పుట్టి  పెరిగింది  మనస్సు
నా  పలుకు  కి  ప్రాణాలే  లేచి వస్తాయి   అంటారు
పెదవితో  నా  పేరునే  పలకమంటాను 
పలికే  ఆ  ఒక్క  పలుకుకి  కూడా  స్వార్ధాన్ని  జోడించి  పలుకుతున్నారు  న్యాయమా
మల్లె  రంగులా  ఉన్న  నన్ను  ఎర్రని  రక్తపు  అడుగుల్లో  మున్చేస్తున్నారే ..
నేను  ఓడితే  చావు  గానే  భావిస్తున్నారే ...
నా  మనస్సు  నా  పిలుపు  పవిత్రమే ...
మీరు  చూసే  చూపు  చేసే  పనులు  నన్ను  నా  వర్ణాన్ని  మారుస్తున్నాయి ...
తప్పు  మీద  లేక  చిన్నా  పెద్ద  తేడాలేకుండా  నన్ను  నేను  అర్పించుకుంటున్న  నాద ..

మీరు  తలిచే  తలపుల్లో  నేను  లేను ..
 కాని  తనివితీరా  ప్రేమను  పంచేవాల్లకి  నేను  ఎప్పుడూ  ఉంటాను
   నేను  ఎవ్వరో  ఏమిచేస్తానో  మీకు  తెలుసు  ..నా  పేరు  ప్రేమ  అంటారు 
ఈరోజు  నా  పుట్టినరోజు  ...
దయచేసి  నన్ను  పంచండి  ...మళ్లి  మీకోసం  పుడతాను  ..
కాని  నాతోపాటు  మీలో  ఉన్నా  స్వార్ధాని  కూడా  జతచేసి  పంచకండి ...
  అలా  చేస్తే ..మళ్లి  నా  పుట్టిన  రోజు  జరుపుకోవటానికి  మీరు  ఉంటారేమో  కాని  నేను  ఉండను ..

                              ఇట్లు  
                                      మీ  ...ప్రేమ