కలగా మిగిలిన ప్రేమ
ఋతువులు మారుతున్న ఓ క్షణం నన్ను తాకుతున్నది
చంద్రుడు అస్తమించి రవి రాకకు వేచి చూస్తున్న వేల దగ్గర అవుతున్నది
కొన్ని అందమైన నక్షత్రాల నడుమ ఓ అపురూప సౌందర్య వనిత ప్రకాశించింది
ఎన్నో మేగాలు దాటుకొని నాకు చేరువగా నడుస్తున్నది
ఆ క్షణం మబ్బులు మాయం మొగ్గలు పుష్పం
ఆ అందమైన క్షణం లో నన్ను చేరిన సౌందర్యం చిన్న చిరునవ్వుతో
"స్వప్నం లో తిరుగాడే నా చిన్న హృదయం నీకు అందించనా
కాలం తో ప్రయాణం చేసే నా ఈ కాయం నీకు అర్పించనా
ఆనందపడే క్షణాలు అణువణువునా అందించనా ప్రియతమా "
ఇలా
నా కనులు దాటని తన అందం తన పెదవి పలుకులతో ఆశలు కల్పించింది
అంతటి అందం సొంతమవుతున్న ఆనందం లో గట్టిగా అరిచాను
ఇంతలో మా అమ్మ వచ్చి నిద్రలేపింది లేచి చూస్తే అంతా మాయ,...
ఇలా నా ప్రేమ కలగానే మిగిలిపోయింది ........
మీ........ప్రవీణ్
No comments:
Post a Comment