జీవితం

                          జీవితం 
జీవితం.....తెలియని గమ్యం కోసం వెతుకులాట 
కష్టాలు,సుఖాలు కలిగిన అనంత జలపాతం 
సూర్యుడి కనుల వెలుగును వేడిగా స్వీకరించినట్లు 
మేఘపు కనుల కన్నీటిని ఆనందంగా స్వీకరించినట్లు
దీపము వెలుగులో గమ్యం కనబడని పక్షుల్లా  
దీపము లేని చోట పథములకై ఎదురుచుసేలా
మారిందా జీవితం ..మార్చుకున్నామా మన జీవితం 
ప్రతి రేయి పగలవుతుంది నువ్వు ఎదురుచూస్తే
ప్రతి అపజయం జయం అవుతుంది కష్టపడితే
కష్టపడితే కల్మషం లేని విజయాలు ప్రతిసారి సొంతం        
                                                                      మీ...  ప్రవీణ్