గెలుపు
తొందరపాటు వలదు సుమా నువ్వు దివికై ఎగసే కడలి సుమా
వెన్నెల కంటి బ్రమలు సుమా అవి తాకగ మారే మాయ సుమా
తారై వెలిగే వెలుగు నీవు ఉరుమై ఉరిమే పలుకునీది
జాబిలి పంచే కనులు నీవి బాధను దాచే మనసు నీది
నయనం వీడని ఆశలే నీ నిర్మల మనసుకు పథములు
గెలుపు గెలుపు కో అలుపు స్వరం ,అలుపు మరచి నువ్వు అడుగువేస్తె
అడుగు అడుగునా గెలుపు స్వరం .....మిత్రమా