ప్రేమ .......నరకపు లోయలవెంట సాగే ఓ అందమైన తీయని భావము
భావము అంటేనే తెలియని నాభాల్యమున భరించలేని గోరము
తనవి తీర ఎడ్చలేని వయసు ఏడిస్తే ఏమికావలి రా అని బెదిరించే పెద్దలు
అటుగా ప్రాణంలేని ఇష్టమైన అమ్మాయి ఇటుగా చావులోకూడా లోతుపాతులు వెతికే పెద్దలు
ఏడ్వలేను అలాగని ఆగలేను పరుగులు తీశాను కేకలు వేశాను
చిన్ని ..చిన్ని పాదాలతో ఎంత పరిగేడితే ఏమి వస్తుంది ఊరి చివర ఉండే శ్మశానం తప్ప ....
ఎప్పుడు నాతొ గోడవ పడ్డట్లుగా ఉండే స్మశానం ఆక్షణం నాకు ...
దగ్గర గా తదేకంగా నావైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది
తన తప్పు ఏమిలేదు తాను మాత్రం ఏమిచేస్తుంది
ఆక్షణం ఆకురాలినది ఆ ఆకును తనలో దాచుకోవటం తప్ప ఏమిచేస్తుంది
అప్పటివరకు స్మశానం కు ఆమడదూరం ఉండే నేను అమాంతం హత్తుకున్నట్లుగా మారిపోయాను
సంద్యా కాలం సమయం లో ఓ చిన్న చిరు నవ్వుతో స్మశానం ను పలకరిస్తూ కాలం గడుపుతున్నాను ......
No comments:
Post a Comment