ఇష్టం

                                            ఇష్టం 
అనంత దూరం లో ఉన్న అందాల ఆకాశం లోని అపురూప తార  
అవని మీద ఆవిర్భవించిన ఆకర్షణీయ అప్పుడే విచ్చిన పుష్పంకు నచ్చింది
రమ్యమైన కాంతులతో  రాగాల మెరుపులతో ప్రతిసారి పలకరించేది తార
అనంత విశ్వంలోని ఆకాశపు అంచున అపురూప తారను చేరుట
అవనిపై అప్పుడే చిగురించిన అందాల పుష్పం కు సాద్యమా......
మనసు ,ప్రాణం ఏకంచేసి  ముత్యపు ఆలోచనలతో మెరుగులు దిద్దుకుంది
సుగంధ వాసనలను  వాహిని వేగంతో వాయువు స్నేహంతో
మింటన నిలిచిన తారను సుగంధ వాసనలుగా చేరుకుంది
  "ఇష్టం ,కృషి ఉంటే  అంధకారం లో  కూడా ఓచిన్నదారి ఉంటుంది  
                                                                             మీ...... ప్రవీణ్  

No comments: