చెంపన సిగ్గులు వచ్చిన సంధ్యను చూడగ వచ్చే ఓ చందనాల మధు బాలుడు
అందని ఆకాశం చూసి ఆపై ఆలోచన చేసి ఆపై విచ్చేసే ఈ ప్రేక్షక బృందం
మురిపించే మైనం లాంటి ఈ సంధ్య వర్ణం తన చెక్కిలి పాల వెల్లువగా మారే
గోరింట పూసే గువ్వలు ఎగిరోచ్చే ఈ సంధ్యా సమయంలో
చిరునవ్వే చిందించే ఈ కల్పవల్లి ..
కదిలొచ్చే అందం కనిపించని వర్ణం కన్నుల్లో దాచింది ఈ సంధ్యా పుష్పం
మగువంటే అందం మరిపించని వర్ణం ఈ గుడిలో దేవతలా కూర్చున్నది ఓ బంధం
No comments:
Post a Comment