స్వాతంత్ర్యం

                స్వాతంత్ర్యం 
మహాత్ముల మరణం మరుసటి రోజున మరచే కల అవుతుందా
స్వాతంత్ర్య ఉద్యమం ఉదయం లేచి ఆడుకునే ఆట అవుతుందా 
తనువు చీల్చుతున్నా,రక్తం పారుతున్నా అలుపు తెలియని ఆకాంక్ష 
కరములు కాల్చుతున్నా,స్వరములు ఖండిస్తున్నా గుండె సడితో చేసే రణదీక్ష
పొలము సాగుచేసిన మనిషికి ఫలము అందక చేసిన పోరాటం   
స్వేచ్చెకోసం ఆరాటంతో బ్రతకటానికి చేసిన మహాపోరాటం 
రవిరాకతో నిద్రలేస్తున్న ఈలోకం చంద్రుడి రాకతోనే నిద్రిస్తుంది   
నిర్మలమైన నిశిరాత్రులలో కూడా క్షణ క్షణం చివరి క్షణం గా చేసిన పోరాట ఫలితమే స్వాతంత్ర్యము
                                                                           మీ ...  ప్రవీణ్ 

No comments: